భారతీయ సంప్రదాయం ప్రకారం ఏర్పడిన వారాల పేర్లు నేడు ప్రపంచం మంతటా వాడుకులో ఉన్నాయి. రోజులో సూర్యోదయంతో ప్రారంభమయ్యే హోరాధిపతి పేరుతో ఆ వరం ఏర్పడుతుంది. హోరా అనగా ఒక గంట కాలం. ఆదివారం ప్రారంభం రవి హోర, సూర్యునికి దగ్గరగా శుక్ర, బుధల హోరలు కాగా రవి అనంతరం ఇవి వచ్చును. తరువాత చంద్ర హోర తదుపరి శని, గురు,కుజ హోరలు చేరును.
ఇందు శుభగ్రహ హోరాలలో శుభ ఫలితములు, పాపగ్రహ హోరాలలో అశుభ ఫలితములు కలుగును. గురు, శుక్రులు – పూర్ణచంద్రుడుతో కలిసిన వీరితో కలిసిన బుధుడు ఈ నలుగురు శుభులు అగును. క్షీణ చంద్రుడు, రవి,కుజ, శనిలు వారితో కలిసిన బుధుడు కలిసి ఈ ఐదుగురు పాపులు అగును.
1. సుర్యహోర: ఉద్యోగ ప్రయత్నములు, సాహస కార్యములకు, పై అధికారులను దర్శించుటకు, క్రయవిక్రయాలకు, సన్మానములు, దస్తావేజులు రాయుటకు, రాజకీయ వ్యవహారాలకు,న్యాయసంబoధ వ్యవాహరాలకు చేయుటకు మంచిది.
2. శుక్రహోర : సమస్తమైన శుభకార్యములకు యోగ్యమైనది. కొత్తబట్టలు, వస్తువులు ధరించుటకు, ప్రయాణం చేయుటకు, ఆపరేషన్స్ కు నూతన వాహనములు ఉపయోగించుటకు, స్త్రీ పరుషుల పరస్పర సమాగమములుకు, ఇత్యాడు అన్నింటికి ఈ హోర మంచిది. నిశ్చయ తాంబులాలకు మంచిది.
3. బుధహోర: వ్యాపార సంబంధిత కార్యములకు, వ్రాతపనులకు, ప్రయానములకు, లెక్కలు వేయుటకు, శిల్పం, జ్యోతిషం వంటి విద్యలు నేర్చుకొనుటకు, బంగారం, వస్త్ర వ్యపారులుకు కూడా చాల మంచిది.
4. చంద్రహోర: స్త్రీ సమాగమం, ప్రేమ వ్యవహారములు, తెల్లని వస్తువుల వ్యాపారం, ఇళ్ళు మారుట, నీటిపై ప్రయాణములు, గృహభరణ పాత్రలు కొనుటకు మరియు వాడుటకు ఉద్యోగం లో చేరుటకు మంచిది.
5. శనిహోర: ఇనుము, మినుములు, నూనె వ్యాపారములకు మరియు యంత్ర వ్యాపారములకు మంచిది.కాని ఇతర పనులకు మంచిది కాదు.
6. గురుహోర: ధనము నిల్వచేసేందుకు, పిల్లలను ఉయ్యాలలో వేయుటకు, వివాహ విషయములు మాట్లాడుకోవటానికి, కొత్త పుస్తకములు చదువుటకు, మందులు తీసుకోవటానికి, బాకీలు వసూళ్ళుకు, లాటరీ, కోత్త వస్త్రభరణాదులు ఉపయోగించుటకు మంచిది.
7. కుజహోర: అగ్ని సంబంధమైన పనులు, సాహస కృత్యాలు, క్రయవిక్రయలకు మంచిది.యధా శక్తి కృషి చేయుటకు మంచిదే. కానీ ఇది అశుభ సమయం. కష్టాలు, నష్టాలు, విరోధాలు, చిక్కులు కలుగుతాయి.జాగ్రత్తగా ఉండలిసిన సమయo.
Post a Comment