బాలారిష్టము:
అష్టమ స్థానమును ఆయుస్థానమంటారు. అష్టమము నుండి అష్టమము అనగా తృతీయమును కూడ ఆయుస్థానమంటారు. ఈ రెండు ఆయుస్థానములకు వ్యయస్థానములైన 7.2 స్థానాలను మారక స్థానములంటారు. ఇందులో 7వ స్థానముకంటె 2వ స్థానము బలమైనది. మరియు 7వ అధిపతి కంటే . మరియు 7వ అధిపతి కంటే 7లో నున్నవారును, వారికంటే 7వ అధిపతితో కలిసినవారు బలవంతులు. వీరందరికంటే 2వ అధిపతియు, 2వ ఇంట్లో ఉన్నవారును, 2వ అధిపతితో కలిసినవారును మారకం చేయుటలో బలవంతులు.
కాల పాలకులు:
కాల పాలకులు:
చంద్రుడు - బాల్యకారకుడు (గురు వర్గంవారికి, శనివర్గంవారికి కూడ బాల్య కారకుడే)
కుజ, శుక్రులు - యౌవన కారకులు 21 నుండి 42 మధ్యకాలము,
రవి, బుధులు - కౌమార కారకులు 42 నుండి 63 మధ్యకాలము
గురు, శనులు - వృద్ధాప్యకారకులు 63 నుండి చివరి వరకు
బాల్యకాల ఆయుర్దాయము:
బాలారిష్టము: బాల్యకాల ఆయుర్దాయముగానే భావించాలి. బాల్యకాల ఆయుర్దాయము బాల్యకారకుడైన చంద్రునకు, ఆయుస్థానమునకు సంబంధించి యుండును. అన్ని భావములకు కారకున్ని తీసుకొన్నట్లే ఆయుర్భావమునకు ఆయుష్కారకుడైన శనిని తీసుకోవాలి. ఆయుస్థానమనగా అష్టమ స్థానమని జ్యోతిష్కులు భావిస్తున్నారు కాని పరాశర మహర్షి 3వ స్థానమునుకూడ ఆయుస్థానముగా తీసుకోవాలన్నారు. అందుచేత 3,8 స్థానములు, ఆయుష్కారకుడైన శని , బాల్యకారకుడైన చంద్రుడు బాల్యకాల ఆయుర్దాయమును ఇవ్వడానికి సమర్థులు వీరు పాపులైతే బాల్యకాల ఆయుర్దాయమును హరించడానికి కూడా సమర్థులు.
బాల్యకాల ఆయుర్దాయమునకు సూత్రము : లగ్నాత్ శుభుడైన అష్టమాధిపతి గాని, శుభుడైన ఆయుష్కారకుడు శనిగాని లగ్నాధిపతిగాని చంద్రున్ని శుభపరచవలెను లేదా చంద్ర క్షేత్రాన్ని శుభపరచవలెను లేదా శుభుడైన చంద్రుడు అష్టమత్రయాన్నిగాని తృతీయత్రయమునుగాని శనిత్రయమును గాని లగ్నత్రయమునుగాని శుభపరచవలెను.
బాల్యకాల ఆయుర్భంగయోగము: లగ్నాత్ పాపియైన అష్టమాధిపతిగాని, ఆయుష్కారకుడుగాని తృతీయాధిపతిగాని బాల్యకారకుడైన చంద్రున్ని లేదా చంద్రక్షేత్రాన్ని చెడగొట్టినచో బాల్యకాల ఆయుర్భంగము జరుగును లేదా పాపియైన చంద్రుడు తృతీయమునుగాని అష్టమత్రయమునుగాని లగ్నత్రయమును గాని చెడగొట్టినచో బాల్యకాల ఆయుర్భంగము జరుగును. బాల్య కారకుడు చంద్రుడు ఒక్కడు మాత్రమే.

Post a Comment