వృషభం: శుక్రుని స్థానం.
ఎద్దు మూపుర భాగం సూచిస్తుంది, ఆహార ధాన్యాలు, పశువుల పాక, వ్యవసాయం, పురుషుడు, గొడ్రాలు , ముఖం మరియు గొంతు, అభిరుచి, ఫైనాన్స్, పంటలు, విలాసలు, నిధులు, అందం, భౌతికవాద విషయాలు, కార్యరూపం, పండ్లు, తెలుపు రంగు, ధర్మపరులయిన కార్మికులు, ఆనందన్నీ ఇష్టపడతారు, పాండిత్యపరమైన ప్రవర్తన, పురుష లక్షణాలు వున్నా మహిళలు, నాలుగు కాళ్ళు, సగం - ఉపయోగకరం, స్త్రీ రాశి , ప్రధాన వీధి, మధ్యాహ్న సమయం, చుట్టూ ప్రహరీ తో ఉన్న ఇల్లు, వీధి మధ్య భాగం, బ్యాంకులు, రహస్య గదులు, ఖజానా(ధనం లేదా నిధి) ఉండే గదులు, సంపద, ఆనందం, మహిళలు నివసించే ప్రదేశం, సారవంతమైన భూములు, అలంకరణ గది, తికమకపెట్టే తత్త్వం, కూడబెట్టడం, పశువులు, నిర్భయమైన గుణం.
నెమ్మదిగా కదులుట, సులభం మరియు విలాసవంతమైన, విశ్వాసం మరియు విధేయత, శృంగారం, నెమ్మదిగా, నిలకడగా, స్థిరంగా, ఆచరణాత్మకమైన, నిశ్చయంతో, పట్టువదలని, నమ్మకమైన విశ్వాసకులు, గెలవడం ఇష్టపడతారు. భోజన ప్రియులు, లలిత కళలు(Fine arts) అంటే ఇష్టం, భావనాత్మకమైన తెలివి, సులభమైన వ్యక్తిత్వం, దౌత్య సంబంధలు, రహస్యమైన, భౌతిక వస్తువుల పై ప్రేమ, సాంప్రదాయ వాది, కుటుంబ సంబంధాల పై ప్రీతి, ప్రియమైన వారి పై విశ్వాసం, చాలా ప్రశాంతం గా మరియు కష్టాలు ఉన్నప్పుడు చాలా ఆందోళనగా వుంటారు, మొండి పట్టుదలగల, అభిమానంతోను, విధేయతతో వుంటారు, విశ్వాసపాత్రులైన వారిని ఇష్టపడతారు.
ఉచ్ఛ: చంద్రుడు (3 డిగ్రీలు)
నీచ: కేతువు
మూలత్రికోణం: చంద్రుడు (4-20 డిగ్రీల)
దిక్కు : దక్షిణ
శరీర భాగాలు: మెడ, స్వర పేటిక, మరియు థైరాయిడ్ గ్రంధి.
ఈ రాశిలోని నక్షత్రాలు: కృత్తిక (మిగిలిన 3 పాదములు), రోహిణి మరియు మృగశిర(2 పాదములు)
కృత్తిక 30° నుండి 40° వరకు సూర్యుని ద్వారా పాలించబడుతుంది.
రోహిణి 40° నుండి 53°20’ వరకు చంద్రుని ద్వారా పాలించబడుతుంది.
మృగశిర 53°20’ - 60° కుజుని ద్వారా పాలించబడుతుంది
ఈ రాశి ప్రాబల్య వ్యవధి : 1 గంట 54 నిమిషాలు
1 వ ద్రేక్కాణ (00 -10 డిగ్రీలు): అగ్ని, మిశ్రమ.
2 వ ద్రేక్కాణ (10- 20 డిగ్రీలు): మృగ
3 వ ద్రేక్కాణ (20 -30 డిగ్రీలు):
పొడవు రాశి,
భూసంబంధమైనది.
భోగం,
అర్ధం,
స్థిరరాశి ,
బంజర,
మృగ,
అంధత్వ రాసి,
దేవత: మహాలక్ష్మీ, మీనాక్షి, కృష్ణుడు
కూరగాయలు,
ధనిక వ్యక్తులు.
డబ్బు అంటే ఇష్టం ఉంటుంది, బంగారం మరియు విలువైన వస్తువులు, అత్యాశ, ఎక్కువ లైంగిక కోరికలు, సౌందర్య సామాగ్రి అంటే ఇష్టం, జలతత్వ శరీర నిర్మాణం, మంచి శరీరాకృతి, స్థిరమైన పద్దతి మరియు ఆకృతి, కుటుంబం మరియు స్నేహితులు పట్ల అనుభందం కలిగి వుంటారు. ప్రజా సంబంధాలు, విధేయుడిగా, అందంగా, ఆకర్షణీయమైన వారిగా వుంటారు. ఇతరుల చర్యలను బట్టి ప్రవర్తన, స్వీయ అహంకారం(నేనే గొప్ప), ఆలోచనలను సహజగా వ్యక్తం చేసే సామర్థ్యం, రహస్య శత్రువులు ఎక్కువ, తమకు నచ్చిన వాటి పై పెట్టుబడి పెడతారు. వస్తువులు మరియు నగలు రహస్యంగా ఉంచుకుంటారు. స్వయం అలంకరణ ఇష్టపడతారు, తమ వాహనాల పనితీరును అద్భుతగా నిర్వహిస్తారు.
విలాసవంతమైన వస్తువులు(Luxury goods) అమ్మకం ,వడ్డీ వ్యాపారం(Finance), వ్యవసాయం, సంగీతం, రవాణా వ్యాపారం.
Post a Comment