Thursday, March 23, 2017

సింహ (leo) రాశి గుణములు

 

సింహం - సూర్యుని స్థానం

   గుహలు, కొండ శిఖరములు, ఎడారులు, కోటలు, రాజభవనాలు, రాజ్యం, పరిపాలన ప్రదేశాలు, రాజధాని మరియు ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, మందులు(ఔషదములు), గోధుమ రంగు, కాలపురుషుని ముఖ్య స్థానం, బొడ్డు, పొట్ట, పొడిబారిన, జంతువు స్వభావం, రాష్ట్ర ప్రభుత్వం, అడవులు, తండ్రి మరియు కుమారుని స్థానం, పురుష రాశి, అగ్ని, గుండె, అభిమానం, నీతి, అహంకారం, గౌరవం, ఆరాధనాభావం, రాజరికం, స్వీయ ఆధిపత్యం, దురహంకారం, ఆశపడు తత్త్వం, గొప్ప రూప లావణ్యములు, శక్తి, వెలుగు, దయ, సామర్ధ్యం, వ్యాపారము, ప్రముఖులు, గంభీరమైన, మిక్కిలి తెలివితేటలు, ఆత్మ విశ్వాసం.

   పాలకులు, గౌరవప్రదంగా వుంటారు, అధికారపూర్వక, నాయకత్వ సామర్థ్యాలను కలిగి వుంటారు, రాజరికం, తెలివి కలిగిన, గర్వం, క్రూరమైన, శ్రద్ధ, ప్రేమించినప్పుడు పిల్లి మరియు నిర్లక్ష్యం చేసినప్పుడు సింహం, ప్రతిష్టాత్మకత, క్రియాశీలత, పొగడ్తలు ఇష్టపడతారు. స్నేహితులకు మరియు కుటుంబానికి సహాయపడతారు, సంరక్షకుని లేదా తండ్రి లాగా, నిర్భయమైన & శక్తివంతమైన, ఒక ఉగ్రమైన విధంగా, సన్నటి ఆకృతి, పేలుడు పదార్దములు.

మూలత్రికోణ : సూర్యుడు (0-20 డిగ్రీలు)
దిక్కు : తూర్పు
ఎత్తు:పొడవు
శరీరభాగాలు: గుండె

ఈ రాశి లోని నక్షత్రాలు : మాఘ, పుబ్బ , ఉత్తర (1వ పాదము)

మాఘ 120° నుండి 133°20’ వరకు కేతు ద్వారా పాలించబడుతుంది.
పుబ్బ 133°20’ నుండి 146°40’ శుక్రుని ద్వారా పాలించబడుతుంది
ఉత్తర 146°40’ నుండి 150° వరకు సూర్యుని ద్వారా పాలించబడుతుంది.

ఈ రాశి ప్రాబల్య వ్యవధి : 2 గంటల 06 నిమిషాల

ద్రేక్కాణ:

1 వ ద్రేక్కాణ (00-10 డిగ్రీలు): చతుష్పాద, ఆయుధ, పక్షి
2 వ ద్రేక్కాణ (10 -20 డిగ్రీలు): ఆయుధ
3 వ ద్రేక్కాణ (20- 30 డిగ్రీలు): ఆయుధ, కౄర.

శీర్షోదయ రాశి,
నాలుగు కాళ్ళ రాశి
స్థిర రాశి,
అగ్నితత్వ రాశి,
వంధ్య రాశి,
మృగ,
బ్రహ్మ,
సాత్విక,
బంగారం,
మూలం(కూరగాయలు).
 
సింహ లగ్నం అయితే :
   
   సాధారణంగా తక్కువ నిగ్రహం ఉంతుంది, ఆప్యాయత లేకపోవడం, అహంకార ప్రదర్శన, స్వీయ అహంకారం, గర్వం, కోపిష్ఠి కార్యకలాపాలు, అంద ప్రదర్శన, మార్పులేని ప్రతిభ ఉంటుంది. శరీరం లోబలమైన ఎముకలు కలిగి వుంటారు, ఉదార వైఖరి, గంభీరంగా కనపడతారు, నాయకత్వ గుణాలు, కళాత్మక ప్రతిభ ఉంటుంది. సాహిత్యం, సంగీతం, నటన, లాటరీ, రేసులు, జూదం, రాజకీయాలు, సినిమా మరియు కమిషన్ వ్యాపారలు మీద ఆసక్తి ఉంటుంది.

వృత్తి (ఉద్యోగం):
   
   ప్రభుత్వ లేదా వాణిజ్య రంగాలలో ప్రముఖమైన ఉద్యోగాలు, స్థిర ఆదాయం, ఉద్యోగ భద్రత ఉంటుంది. కార్యనిర్వహణ అధికారులు మరియు అలసిపోని ఉద్యోగాలు, ఉత్తమ మరియు పెద్ద సంస్థలయందు మేనేజర్ ఉద్యోగాలు, ఒక శాఖ యొక్క పై అధికారి, కెప్టెన్, సేల్స్ మేనేజర్, గాజు కర్మాగారాల్లో ఉద్యోగాలు, తయారీ(manufacturing) కర్మాగారాల్లో ఉద్యోగాలు.


Post a Comment

Start typing and press Enter to search