
కర్కాటకం - చంద్రుని స్థానం
నీటి ప్రదేశాలు, ట్యాంకులు, స్నానపు గది, పాల బూతులు, దేవతా ప్రదేశాలు, గులాబీ రంగు, తల్లి మరియు కుమార్తె యొక్క స్థానం, ఆవు పాక, వ్యవసాయం, అధిపతుల (ప్రభువుల) నివాసం, స్త్రీ స్థానం, సముద్రాలు, నదులు, నీటి కి సంబందించిన అంశాలు, మోక్ష స్థానం, నిశ్శబ్దము గా ఉండటం, చాల తొందరగా అవగాహన చేసుకోవడం, పెరుగుదల ఉంటుంది. పూర్తి ఉపయోగకర రాశి, ప్రశాంత స్వభావం, ఎక్కువ కాళ్ళు కలిగిన రాశి, సన్నని ఆకృతి, నివసించే ఇల్లు, ధాన్యం నిల్వ ఉంచే ప్రదేశం, విద్య మరియు విద్యాసంస్థలు, భవన సముదాయాలు, ఆవరణ(ప్రహరీ) కలిగి ఉన్న ఇల్లు, పీత ఆకృతి, వ్యవసాయ భూములు, మంచి అభిరుచి ఉంటుంది, దురాశ తో కూడిన కోరికలు, ప్రయాణలు మరియు మార్పులు, భావోద్వేగాలు ఎక్కువ, అద్దం, ప్రతిబింబలు, పరిసరాలు, అదృశ్యం(కనపడక పోవడం), వ్యంగ్యగా - విమర్శనాత్మకంగా - హేళన గా మాట్లాడం.
మార్పులు చేసేవారు, రవాణ, భావోద్వేగలు కలిగిన మరియు సున్నితమైన వారు, సహజమైన స్వభావం, రక్షణ, మంచి జ్ఞాపకశక్తి, జ్ఞాపకాలను మరియు వస్తువులను దాచుకుంటారు. సానుభూతి, ఉదారస్వభావం, ప్రయాణలు బాగా ఇష్టపడతాడు వారికి ఇల్లు పదిలంగా ఉన్నంత వరకు. ఉపచారాలు చేస్తారు,మంచి వ్యాపార స్వభావం. పిరికితనం ఉంటుంది కానీ బాగా ఇష్టం అయినా వాళ్ళు భయపెడితే దూకుడు గ వ్యవహరిస్తారు. బాగా నేర్చుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. నిజాయితీ ఉంటుంది మరియు సులభంగా ఆకట్టుకునే స్వభావం.
ఉచ్ఛ : బృహస్పతి (5 డిగ్రీల)
నీచ : కుజుడు (28 డిగ్రీలు)
దిక్కు : ఉత్తరం
ఎత్తు:మధ్యస్థ
శరీర భాగములు: ఊపిరితిత్తులు మరియు ఛాతీ
ఈ రాశిలోని నక్షత్రలు: పునర్వసు (ఒక పాదం), పుష్యమి, ఆశ్లేషా.
పునర్వసు 90° నుండి 93°20’ వరకు బృహస్పతి ద్వారా పాలించబడుతుంది.
పుష్యమి 93°20’ నుండి 106°40’ వరకు శని ద్వారా పాలించబడుతుంది.
ఆశ్లేషా 106°40 నుండి 120° వరకు బుధుని ద్వారా పాలించబడుతుంది
ఈ రాశి ప్రాబల్య వ్యవధి : 2 గంటల 12 నిమిషాల
ద్రేక్కాణ:
ద్రేక్కాణ:
1వ ద్రేక్కాణ (00 - 10 డిగ్రీలు): చతుష్పాద
2వ ద్రేక్కాణ (10 - 20 డిగ్రీలు): సర్ప
3వ ద్రేక్కాణ ( 20 - 30 డిగ్రీలు): సర్ప
పృష్టోదయ రాశి,
పొట్టి రాశి ,
బహుళ కాళ్ళు కలిగిన రాశి
ఫలవంతమైన రాశి,
పశుప్రాయమైన (మృగ),
దేవత: పార్వతీదేవి,
జలుబు (కఫం),
సాత్వికం,
దంతము,
ధాతువులు (ఖనిజాలు).
కర్కాటక లగ్నం అయితే:
2వ ద్రేక్కాణ (10 - 20 డిగ్రీలు): సర్ప
3వ ద్రేక్కాణ ( 20 - 30 డిగ్రీలు): సర్ప
పృష్టోదయ రాశి,
పొట్టి రాశి ,
బహుళ కాళ్ళు కలిగిన రాశి
ఫలవంతమైన రాశి,
పశుప్రాయమైన (మృగ),
దేవత: పార్వతీదేవి,
జలుబు (కఫం),
సాత్వికం,
దంతము,
ధాతువులు (ఖనిజాలు).
కర్కాటక లగ్నం అయితే:
లోతైన నీటిలో ఉండేటటువంటి ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా వుంటారు, వారి నిజమైన ప్రతిభను బయట పెట్ట లేరు, జ్ఞానం కలిగి వుంటారు, సమర్థత కలిగి వుంటారు. పరిస్థితులకు అనుగుణంగా వుంటారు. ఏ ఒక్క ప్రదేశంలోను ఎక్కువకాలం ఉండటాన్నీ ఇష్టపడరు. మంచి లేదా చెడు లక్షణాలు అభివృద్ధి చేసుకునే స్వభావం కలిగి వుంటారు. చర్యలుల్లో మరియు ఆలోచనల్లో వేగం ఉంటుంది, లోతైన ఆలోచనలు కలిగి వుంటారు. శరీరంలో నీరు అధికంగా ఉంటుంది, బాధ్యతలను తపించుకోవాలని చూస్తారు. అన్ని విషయాలు అంగీకరిస్తారు, పలుకుబడి అంటే ఆశక్తి ఉండదు.
వృత్తి (ఉద్యోగం):
వృత్తి (ఉద్యోగం):
లాభార్జనే లక్ష్యంగా గల ఉద్యోగాలు, నీటికి సంబదించిన వృత్తులు, నావికులు, నౌకాదళం, జలాంతర్గామి, రవాణా విభాగాలు, దిగుమతి లేదా ఎగుమతి, రవాణా మరియు ప్రయాణా ఉద్యోగాలు, కేటరింగ్ చేసేవాళ్ళు, రెస్టారెంట్ మేనేజర్, వక్త లేదా ప్రసంగికుడు (anchor), బోధకుడు, కాంట్రాక్టర్ లేదా నీటిపారుదల శాఖలో మంచి ఉద్యోగం.
Post a Comment